బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం.. కోస్తాలో మరో మూడు రోజులు వానలే వానలు!
- కోస్తాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు
- మరో 48 గంటల్లో బంగాళాఖాతంలో అల్ప పీడనం
- అల్లకల్లోలంగా సముద్రం
శనివారం సాయంత్రం వరకు శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళిలో 6.5, విశాఖపట్నం జిల్లా ముంచంగిపుట్టులో 6, అనంతగిరిలో 5 సెంటీమీటలర్ల వర్షపాతం నమోదైంది. సముద్రం అల్లకల్లోలంగా ఉండి అలలు ఎగసిపడుతుండడంతో కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్టణం, గంగవరం, కాకినాడ ఓడరేవుల్లో మూడో నంబరు ప్రమాద హెచ్చరిక ఎగురవేశారు.