Andhra Pradesh: బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం.. కోస్తాలో మరో మూడు రోజులు వానలే వానలు!

  • కోస్తాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు
  • మరో 48 గంటల్లో బంగాళాఖాతంలో అల్ప పీడనం
  • అల్లకల్లోలంగా సముద్రం
ఓవైపు వాయవ్య బంగాళాఖాతంలో ఆవరించిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండడం, మరోవైపు గుజరాత్ నుంచి ఆవర్తనం వరకు ద్రోణి విస్తరించడంతో కోస్తాలో ఎడతెరిపి వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారడంతో రానున్న మూడు రోజుల్లో కోస్తాలో విస్తారంగా, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 48 గంటల్లో ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి ఆ తరువాత బలపడుతుందని పేర్కొంది.

శనివారం సాయంత్రం వరకు  శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళిలో 6.5, విశాఖపట్నం జిల్లా ముంచంగిపుట్టులో 6, అనంతగిరిలో 5 సెంటీమీటలర్ల వర్షపాతం నమోదైంది. సముద్రం అల్లకల్లోలంగా ఉండి అలలు ఎగసిపడుతుండడంతో కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్టణం, గంగవరం, కాకినాడ ఓడరేవుల్లో మూడో నంబరు ప్రమాద హెచ్చరిక ఎగురవేశారు.  
Andhra Pradesh
rains
bay of bengal

More Telugu News