నువ్వా? నేనా? అంటున్న కోహ్లీ, రోహిత్... ఒకే రికార్డు కోసం ఇద్దరూ పోటీ!
- టి20 క్రికెట్లో అత్యధిక అర్ధసెంచరీలు సాధించిన కోహ్లీ, రోహిత్
- ఇద్దరి ఖాతాలో చెరో 20 ఫిఫ్టీలు
- విండీస్ తో మ్యాచ్ లో ఎవరు ఫిఫ్టీ చేసినా సరికొత్త రికార్డు
ఇవాళ జరగబోయే మ్యాచ్ లో అందరి కళ్లు వీరిపైనే ఉంటాయనడంలో సందేహంలేదు. ఆటేతర విషయాలు కూడా ప్రాధాన్యం సంతరించుకున్నా, ఒకే ప్రపంచరికార్డు కోసం ఇద్దరూ పోటీలో ఉండడం అరుదైన విషయంగా చెప్పాలి. కాగా, కోహ్లీ, రోహిత్ తర్వాత కివీస్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ 16 హాఫ్ సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నాడు.