Machail Yatra: కశ్మీర్లో నిన్న అమర్ నాథ్ యాత్ర.. నేడు మరో యాత్ర నిలిపివేత!

  • కిష్త్వర్ జిల్లాలో జరిగే మచైల్ యాత్ర
  • దుర్గామాతను దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో వెళ్లిన భక్తులు
  • 320 కిలోమీటర్ల దూరంలోనే భక్తులను ఆపేసిన అధికారులు
ఉగ్రవాదులు దాడి చేసే అవకాశం ఉందంటూ అమర్ నాథ్ యాత్రను జమ్ముకశ్మీర్ ప్రభుత్వం నిలిపివేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈరోజు మరో యాత్రను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కిష్త్వర్ జిల్లాలో జరిగే మచైల్ మాత యాత్రను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో, దుర్గామాత ఆలయం వరకు జరిగే మచైల్ యాత్రకు ప్రారంభ స్థానమైన 320 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉధంపూర్ వద్దే యాత్రికులను నిలిపివేశారు. ఈ సందర్భంగా కిష్త్వర్ జిల్లా కమిషనర్ అంగ్రేజ్ సింగ్ రానా మాట్లాడుతూ, మచైల్ యాత్రను నిలిపి వేస్తున్నామని చెప్పారు. ప్రతియేటా మచైల్ దుర్గామాతను దర్శించుకునేందు భారీ సంఖ్యలో భక్తులు వెళ్తుంటారు.
Machail Yatra
Jammu And Kashmir

More Telugu News