అన్న క్యాంటీన్ల మూసివేత నేపథ్యంలో.. విజయవాడలో భోజనాలు ఏర్పాటు చేసిన టీడీపీ ఎమ్మెల్యే గద్దె!
- పలుచోట్ల మూతపడ్డ అన్న క్యాంటీన్లు
- ప్రభుత్వ తీరుపై టీడీపీ నేత ఆగ్రహం
- ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని వ్యాఖ్య
మీరు ఎలక్షన్ లో గెలిచారు కాబట్టి మీ(జగన్) పేరు, మీ నాన్నగారి పేరు పెట్టుకోండి. కానీ మేం కోరేది ఏంటంటే పేదవారికి రోజుకు రూ.15లతో భోజనం దొరుకుతోంది. రాణిగారితోట ప్రాంతంలో నూటికి నూరు శాతం పేదవారే. ఇక్కడ పెన్షన్లతోనే బతుకుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడి ప్రజలు అన్న క్యాంటీన్లు లేక ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. అంటే వైసీపీ ప్రభుత్వం మళ్లీ క్యాంటీన్లు ప్రారంభించేవరకూ ప్రజలు ఆకలితో అల్లాడాలా? అవినీతి జరిగితే ఎంక్వైరీ చేసుకోండి. కానీ భోజనం ఆపడం ఏంటి?’ అని నిలదీశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలకు ఎమ్మెల్యే భోజనాన్ని పంచారు. అయితే తాము భోజనం పంచడానికి వీల్లేదని అధికారులు చెప్పారన్నారు.