Tirumala: తిరుమల కొండపై హోటళ్ల దోపిడీకి అడ్డుకట్ట.. ఇక ఇడ్లీ రూ.7.50, భోజనం రూ.22.50 మాత్రమే!

  • రెండు ఇడ్లీలకు రూ.25, ప్లేట్ మీల్స్‌కు రూ.60 వసూలు చేస్తున్న హోటళ్లు
  • దోపిడీకి దేవాదాయ శాఖ అడ్డుకట్ట
  • ఫిర్యాదులకు టోల్‌ఫ్రీ నంబరు
తిరుమల కొండపై భక్తులను ఎడాపెడా దోచుకుంటున్న హోటళ్లపై దేవాదాయ శాఖ దృష్టి సారించింది. కొండపై ప్రస్తుతం రెండు ఇడ్లీలకు రూ.25, ప్లేట్ మీల్స్‌కు రూ.60 వసూలు చేస్తున్నారు. ఇకపై వీటి ధరలను రూ.7.50, రూ.22.50గా నిర్ణయించింది. ఫుల్ మీల్స్‌కు రూ.31గా తీసుకోవాలని దేవాదాయశాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం కొండపై 17 పెద్ద హోటళ్లు, 8 చిన్న హోటళ్లు, 150 ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, 30 చిరు దుకాణాలు ఉన్నాయి. వీటిలో ఎవరైనా నిర్ణయించిన ధరకు కాకుండా ఎక్కువ ధరకు విక్రయిస్తే టోల్‌ఫ్రీ నంబరు 18004254141కి ఫోన్ చేయాలని ఏపీ ఎండోమెంట్స్ విభాగం తెలిపింది.
Tirumala
Tirupati
Hotels
Rates
Andhra Pradesh

More Telugu News