nimmagadda prasad: సెర్బియాలో బెయిలుపై విడుదలైన నిమ్మగడ్డ.. అయినా అక్కడే!

  • గత నెల 27న సెర్బియాలో అరెస్ట్ అయిన నిమ్మగడ్డ
  • శుక్రవారం షరతులతో కూడిన బెయిలు మంజూరు
  • అరెస్ట్‌ను సమర్థించిన ఉన్నత న్యాయస్థానం
సెర్బియా పోలీసుల అదుపులో ఉన్న ప్రముఖ వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌ షరతులతో కూడిన బెయిలుపై విడుదలయ్యారు. ‘వాన్‌పిక్’ కేసులో నిందితుడిగా ఉన్న నిమ్మగడ్డపై రస్ ఆల్ ఖైమా (రాక్) అభ్యర్థన మేరకు 2016లో అబుదాబిలోని ఇంటర్‌‌పోల్ రెడ్‌కార్నర్ నోటీసు జారీ చేసింది. ఈ నేపథ్యంలో గత నెల 27న సెర్బియా వెళ్లిన నిమ్మగడ్డను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిమ్మగడ్డ నిర్బంధాన్ని బెల్‌గ్రేడ్‌లోని ఉన్నత న్యాయస్థానం కూడా సమర్థించింది.

ఈ సందర్భంగా న్యాయస్థానం తన అభిప్రాయం వెలువరిస్తూ.. నిర్బంధం అమల్లో ఉంటుందని, ప్రతీ రెండు నెలలకు ఓసారి పరిస్థితులను సమీక్షించి నిర్బంధ ఉత్తర్వులను పొడిగించే అవకాశం ఉంటుందని పేర్కొంది. అంతేకాక, ఈ నిర్బంధాన్ని గరిష్టంగా ఏడాది వరకు పొడిగించే అవకాశం ఉందని స్పష్టం చేసింది. సెర్బియాలో నిందితుడికి నివాసం లేదు కాబట్టి రాగేటరీ లేఖల ఆధారంగా అప్పగింత కార్యక్రమాలు పూర్తయ్యయేలోగా పారిపోవడానికి, తప్పించుకోవడానికి అవకాశం ఉండడంతో నిర్బంధంలోకి తీసుకోవచ్చంటూ పోలీసుల చర్యను సమర్థించింది.

అంతేకాదు, ఈ విషయంలో నిందితుడి వాదనలు కూడా వినాల్సిన అవసరం లేదని, ఇక్కడి చట్టాలు అందుకు అనుమతిస్తున్నాయని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, గత ఐదు రోజులుగా పోలీసుల నిర్బంధంలో వున్న నిమ్మగడ్డకు శుక్రవారం రాత్రి కోర్టు బెయిలు మంజూరు చేసింది. అయితే, బెల్‌గ్రేడ్ నగరాన్ని విడిచి వెళ్లరాదన్న షరతు విధించింది.
nimmagadda prasad
serbia
Andhra Pradesh
vanpc
belgrade

More Telugu News