Vijay Devarakonda: 'డియర్ కామ్రేడ్' తొలివారం వసూళ్లు

షార్ట్స్‌లో చూడండి
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా భరత్ కమ్మ దర్శకత్వంలో రూపొందిన 'డియర్ కామ్రేడ్' క్రితం నెల 26వ తేదీన విడుదలైంది. రష్మిక మందన కథానాయికగా నటించిన ఈ సినిమా, సంగీతం పరంగా మంచి మార్కులు కొట్టేసింది. కథాకథనాల పరంగా మాత్రం ఆడియన్స్ అంచనాలను అందుకోలేక యావరేజ్ టాక్ తెచ్చుకుంది.

ఈ సినిమా విడుదలైన వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 13.66 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 20.49 కోట్ల షేర్ ను రాబట్టింది. 2వ వారంలో వసూళ్లు నిలకడగా వుంటే, నష్టాల శాతం తగ్గే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆ స్థాయిలో ఆదరణ పొందకపోవడం విజయ్ దేవరకొండ అభిమానులకు అసంతృప్తిని కలిగించే విషయమే.
Go Back to Shorts
Vijay Devarakonda
Rashmika

More Telugu News