Jagan: సీఎం జగన్ కు ప్రధాన భద్రతాధికారిగా పరమేశ్వరరెడ్డి నియామకం

  • ఇప్పటికే జగన్ కు సీఎస్ఓగా వ్యవహరిస్తున్న జోషి
  • మరో సీఎస్ఓగా బాధ్యతలందుకోనున్న పరమేశ్వరరెడ్డి
  • నెల్లూరు అడ్మిన్ విభాగంలో అడిషనల్ ఎస్పీగా పనిచేస్తున్న పరమేశ్వరరెడ్డి
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు మరో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా పరమేశ్వరరెడ్డి నియమితుడయ్యారు. పరమేశ్వరరెడ్డి ప్రస్తుతం నెల్లూరు అడ్మిన్ విభాగంలో అదనపు ఎస్పీగా పనిచేస్తున్నారు. కాగా, జగన్ కు ఇప్పటికే జోషి ప్రధాన భద్రతాధికారిగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో, రెండో ప్రధాన భద్రతాధికారిగా పరమేశ్వరరెడ్డిని నియమిస్తూ ఏపీ సర్కారు ఉత్తర్వులు జారీచేసింది. పరమేశ్వరరెడ్డి త్వరలోనే బాధ్యతలు అందుకోనున్నారు.
Jagan
Andhra Pradesh

More Telugu News