Jagan: పింగళి వెంకయ్య సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి: జగన్

  • స్వాతంత్ర్య సమరయోధుడిగా వెంకయ్య పోరాటం చిరస్మరణీయమన్న జగన్
  • వెంకయ్య స్ఫూర్తి ఆదర్శనీయమన్న చంద్రబాబు
  • వ్యవసాయ, భూగర్భ శాస్త్ర పరిశోధనల్లో ఎంతో కృషి చేశారన్న లోకేశ్
జాతీయపతాక రూపశిల్పి పింగళి వెంకయ్య సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఈరోజు పింగళి వెంకయ్య జయంతిని పురస్కరించుకుని జగన్ ట్వీట్ చేశారు. స్వాతంత్ర్య సమరయోధుడిగా ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమని అన్నారు.

దేశానికి జాతీయపతాకాన్ని అందించిన గౌరవాన్ని తెలుగువారికి దక్కించిన మహనీయుడు పింగళి వెంకన్న అని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. హోమ్ రూల్, వందేమాతరం ఉద్యమాల్లో వెంకయ్య స్ఫూర్తి అందరికీ ఆదర్శనీయమని చెప్పారు.

టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, వ్యవసాయ, భూగర్భ శాస్త్ర పరిశోధనల్లో కూడా పింగళి వెంకయ్య ఎంతో కృషి చేశారని చెప్పారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ఖనిజ పరిశోధక శాఖ సలహాదారుగా సేవలందించారని కొనియాడారు. ఆ మహనీయుని సేవలను స్మరించుకుందామని చెప్పారు.
Jagan
Chandrababu
Nara Lokesh
Pingali Venkaiah
Jayanthi

More Telugu News