Vijay Sai Reddy: ప్రజల్ని ప్రలోభపెట్టేందుకు ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లలో రూ.150 కోట్ల స్కాం జరిగింది: విజయసాయిరెడ్డి

  • అన్న క్యాంటీన్ల విషయంలో మాటల యుద్ధం
  • క్యాంటీన్లు మూసివేస్తున్నారంటూ టీడీపీ ఆందోళన
  • తక్కువ ధరకు భోజనం పెట్టే పథకంలో కూడా దోచుకున్నారంటూ విజయసాయి కౌంటర్
అన్న క్యాంటీన్ల విషయంలో అధికార వైసీపీ, విపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. క్యాంటీన్లను సర్కారు మూసివేస్తోందంటూ టీడీపీ గళమెత్తగా, అన్న క్యాంటీన్ల ఏర్పాటులో పెద్ద కుంభకోణం ఉందంటూ తాజాగా వైసీపీ అగ్రనేత విజయసాయిరెడ్డి ఆరోపణలు చేశారు.

ఎన్నికల ముందు ప్రజల్ని ప్రలోభపెట్టేందుకే చంద్రబాబు సర్కారు అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసిందని, అన్న క్యాంటీన్ల నిర్మాణంలో రూ.150 కోట్ల మేర కుంభకోణం జరిగిందని ట్వీట్ చేశారు. చివరికి పేదవాళ్లకు అతి తక్కువ ధరకు భోజనం పెట్టే పథకంలో కూడా దోచుకున్నారంటూ మండిపడ్డారు. రూ.2 లక్షలతో నిర్మించే క్యాంటీన్ కు రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఖర్చయిందంటూ లెక్కలు చూపారని విజయసాయి ఆరోపించారు.
Vijay Sai Reddy
YSRCP
Chandrababu
Telugudesam
Anna Canteen

More Telugu News