బొగత జలపాతం ఉగ్రరూపం...సందర్శకులు రావద్దని అటవీ శాఖ సూచన
- కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాల ప్రభావం
- సమీపంలోకి అనుమతించమని ప్రకటన
- మద్యం సేవించి వచ్చే వారికి ప్రవేశం నిషిద్ధం
‘ప్రస్తుతం వరద ప్రవాహం అధికంగా ఉంది. తగ్గే వరకు పర్యాటకులు రాకపోవడం మంచిది. ఒకవేళ తెలియక వచ్చిన వారు మా సూచనల మేరకు ఫెన్సింగ్ దాటి వెళ్లకూడదు. మద్యం సేవించి వచ్చే వారిని ఫెన్సింగ్ వరకు కూడా అనుమతించం. ఈ విషయంలో సందర్శకులు సహకరించాలి’ అంటూ అటవీ శాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు.