Errabelli: ఒక్కరి వల్ల పనంతా ఆగిపోతోందని నా అనుచరుడ్ని ఉద్దేశించి అన్నాను... ఎవరినీ బెదిరించలేదు: ఎర్రబెల్లి

  • పత్రికల్లో తనపై వచ్చిన కథనాలను ఖండించిన ఎర్రబెల్లి
  • పనులు ఆలస్యంగా జరుగుతుండడం పట్ల స్పందించానంటూ వివరణ
  • అనుచరుడితో చెప్పిన మాటలను వక్రీకరించారంటూ అసహనం
వరంగల్ లో ఏర్పాటు చేస్తున్న కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు వ్యవహారంలో తాను బెదిరింపులకు పాల్పడినట్టు వస్తున్న కథనాలపై తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అసహనం వ్యక్తం చేశారు. పత్రికల్లో వచ్చిన కథనాలు అవాస్తవం అని స్పష్టం చేశారు. ఒక్కరి వల్ల పనంతా ఆగిపోతోందని తన అనుచరుడితో అన్న మాటలను బెదిరింపులుగా వక్రీకరించారని ఆరోపించారు. ఆ తర్వాత రోజు ఉదయం అతడు తనవద్దకు వచ్చి వివరణ ఇచ్చాడని మంత్రి తెలిపారు. అంతేతప్ప, వరంగల్ టెక్స్ టైల్ పార్క్ విషయంలో తాను ఎవరినీ బెదిరించలేదని అన్నారు. పనుల్లో జాప్యం జరుగుతుండడంతో టెక్స్ టైల్ పార్క్ వద్దకు వెళ్లాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు.
Errabelli
Telangana
TRS

More Telugu News