Minister: శిశువులకు తల్లి పాలు శ్రేయస్కరం, డబ్బా పాలు వద్దు: మంత్రి వెల్లంపల్లి

  • విజయవాడలో తల్లి పాల వారోత్సవాల కార్యక్రమం
  • ఐఎంఏ హాల్- పాత గవర్నమెంట్ హాస్పిటల్ వరకు ర్యాలీ
  • తల్లిపాలతో శిశువులకు ఆరోగ్యం: వెల్లంపల్లి  
శిశువులకు తల్లి పాలు శ్రేయస్కరమని, డబ్బా పాలు వాడొద్దని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సూచించారు. ఇండియన్ అకాడమీ పిరియాడిక్ కృష్ణా జిల్లా విభాగం ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన తల్లి పాల వారోత్సవాల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు.  

ఇండియన్ అకాడమీ పిరియాడిక్ అసోసియేషన్ రూపొందించిన ఓ యాప్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ, తల్లిపాలు ఇవ్వడం వల్ల శిశువులు ఆరోగ్యంగా ఉంటారని, ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. అనంతరం, బందరు రోడ్డులోని ఐఎంఏ హాల్ నుంచి పాత గవర్నమెంట్ హాస్పిటల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పలువురు వైద్యులు పాల్గొన్నారు
Minister
Vellampalli
Mla
Malladi
Vijayawada

More Telugu News