Jagan: ప్రగతి భవన్ చేరుకున్న జగన్.. కాసేపట్లో కేసీఆర్ తో భేటీ

  • తెలంగాణ గవర్నర్ తో భేటీ అయిన జగన్
  • దాదాపు గంట సేపు చర్చలు
  • ఈ సాయంత్రం జెరూసలేం వెళ్లనున్న జగన్
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రగతి భవన్ చేరుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఆయన భేటీ కానున్నారు. ఢిల్లీలో ఇరు రాష్ట్రాల అధికారుల భేటీ సందర్భంగా చర్చించాల్సిన అంశాల అజెండాను ఈ సందర్భంగా ఖరారు చేయనున్నారు. అంతకు ముందు తెలంగాణ గవర్నర్ నరసింహన్ ను ఆయన కలిశారు. రాజ్ భవన్ లో వీరిద్దరి మధ్య గంటసేపు చర్చలు జరిగాయి.

అనంతరం ఈ సాయంత్రం కుటుంబసభ్యులతో కలసి జెరూసలేం పర్యటనకు జగన్ వెళ్లనున్నారు. నాలుగు రోజుల పాటు జెరూసలేంలో పర్యటించనున్నారు. 5వ తేదీ మధ్యాహ్నానికి అమరావతి చేరుకుంటారు. 6వ తేదీన ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ కానున్నారు.
Jagan
KCR
Narasimhan
TRS
YSRCP

More Telugu News