Mahesh Babu: మహేశ్ బాబు 27వ సినిమా కోసం రంగంలోకి సోని సంస్థ?

  • మహేశ్ 26వ సినిమాగా 'సరిలేరు నీకెవ్వరు'
  • 27వ సినిమా దర్శకుడిగా వంశీ పైడిపల్లి
  •  ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్
ప్రస్తుతం మహేశ్ బాబు .. అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'సరిలేరు నీకెవ్వరు' సినిమా చేస్తున్నాడు. ఇది మహేశ్ బాబుకి 26వ సినిమా. తన 27వ సినిమాను ఆయన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయనున్నాడు. 'మహర్షి' సినిమా షూటింగు సమయంలోనే ఈ కమిట్మెంట్ జరిగిపోయింది. 'మహర్షి' సినిమాకి నిర్మాతలుగా వ్యవహరించిన పీవీపీ .. దిల్ రాజు, మహేశ్ 27వ సినిమాను కూడా నిర్మించాలని భావించారు.

వీలైతే తనే సోలోగా ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించాలని దిల్ రాజు అనుకున్నారు. అయితే సోనీ సంస్థ ఈ సినిమాను నిర్మించడానికి ఉత్సాహాన్ని చూపుతోందట. ఈ బడా సంస్థ వంశీ పైడిపల్లితో సంప్రదింపులు మొదలు పెట్టినట్టుగా చెప్పుకుంటున్నారు. ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగుకి వెళ్లే ఈ సినిమాకి నిర్మాతలుగా ఎవరు ఉండనున్నారనేది త్వరలోనే తేలనుంది. 
Mahesh Babu
Vamsi Paidipalli

More Telugu News