Kiara advani: బాలీవుడ్ హీరోతో డేటింగ్ చేస్తున్న కైరా అద్వానీ?

  • సిద్ధార్థ్ మల్హోత్రాతో కైరా డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు
  • నిన్న 27వ పుట్టిన రోజు జరుపుకున్న కైరా 
  • సిద్దార్థ్ తో కలసి వెళ్లిపోయిన ముద్దుగుమ్మ 
ఇటు టాలీవుడ్ తో పాటు అటు బాలీవుడ్ లో కూడా బిజీబిజీగా ఉన్న కైరా అద్వానీ బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో డేటింగ్ చేస్తోందనే వార్తలు బీటౌన్ లో షికారు చేస్తున్నాయి. వీరిద్దరూ పలు సందర్భంల్లో కెమెరా కంట పడటం ఈ వార్తలకు మరింత ఊతమిస్తోంది. అంతేకాదు, కాఫీ విత్ కరణ్ షోలో కైరా మాట్లాడుతూ, 'ఏక్ విలన్' యాక్టర్ తో డేటింగ్ చేయాలనుందని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ఈ చిత్రంలో సిద్ధార్థ్ నటించాడు.

నిన్న కైరా తన 27వ పుట్టినరోజును జరుపుకుంది. తన బర్త్ డేను పురస్కరించుకుని నిన్న రాత్రి ముంబైలో తన స్నేహితులకు పార్టీ ఇచ్చింది. ఈ పార్టీకి హీరో షాహిద్ కపూర్ హాజరయ్యాడు. పార్టీ అనంతరం సిద్ధార్థ్ తో కలసి కైరా వెళ్లిపోవడం... అందరి దృష్టిని ఆకర్షించింది. అంతేకాదు, ఇద్దరూ కలసి కెమెరాలకు పోజులు కూడా ఇచ్చారు. దీంతో, ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారనే వార్తలు మరింత ఎక్కువయ్యాయి.
Kiara advani
Sidharth Malhotra
Bollywood
Dating

More Telugu News