KTR: కేబినెట్ విస్తరణ గురించి నాకు ఎలా తెలుస్తుంది?: కేటీఆర్

  • పార్టీ విషయాల గురించే నన్ను అడగండి
  • గవర్నర్ ను మర్యాదపూర్వకంగానే కలిశా
  • మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రెడీ 
కేవలం పార్టీ విషయాల గురించే తనను అడగాలని... కేబినెట్ గురించి అడగవద్దని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాకు తెలిపారు. కేబినెట్ విస్తరణ గురించి ప్రశ్నించిన మీడియాకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు. కేబినెట్ విస్తరణ గురించి తనకు ఎలా తెలుస్తుందని ఆయన ప్రశ్నించారు. గవర్నర్ తో భేటీకి అంత ప్రాధాన్యత లేదని... మర్యాదపూర్వకంగానే కలిశానని చెప్పారు. మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీని కింద స్థాయి నుంచి బలోపేతం చేస్తామని చెప్పారు. ఇప్పటికే వార్డు కమిటీలు, గ్రామ కమిటీలు, మండల కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని చెప్పారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజమేనని అన్నారు.
KTR
KCR
TRS
Cabinet
Telangana

More Telugu News