కారులో వెళుతూ... ఫోన్ లో అందరికీ క్షమాపణలు చెప్పిన 'కాఫీ డే' సిద్ధార్థ
- కారులో ఉన్నంతసేపూ ఫోన్లో మాట్లాడుతూనే ఉన్న సిద్ధార్థ
- ఆయన ప్రవర్తనలో ఎటువంటి మార్పు కనిపించలేదన్న భార్య
- స్వగ్రామానికి వెళ్తున్నానని భార్యకు చెప్పి ఆత్మహత్య
సిద్ధార్థ భార్య మాళవిక మాట్లాడుతూ.. ఉదయం ఆఫీసుకు వెళ్తున్నానని చెప్పినప్పుడు కూడా ఆయన ప్రవర్తనలో ఎటువంటి మార్పు లేదని, చాలా కూల్‌గానే ఉన్నారని తెలిపారు. ఉదయం 11 గంటల సమయంలో ఆఫీసు నుంచి స్వగ్రామానికి వెళ్తున్నానని చెప్పినప్పుడు కూడా తనకు అనుమానం రాలేదని కన్నీళ్లు పెట్టుకున్నారు. స్వతహాగా ఆయన ప్రకృతి ప్రేమికుడు కావడంతో తరచూ స్వగ్రామానికి వెళ్తుంటారని మాళవిక తెలిపారు.