Puri: 'జనగణమన' కోసం యష్ ను రంగంలోకి దింపుతోన్న పూరి

  • పూరి నుంచి 'జనగణమన'
  • కథ వినేసిన కన్నడ హీరో యష్ 
  • త్వరలోనే ప్రకటన చేసే ఛాన్స్  
పూరి జగన్నాథ్ కొంతకాలం క్రితం మహేశ్ బాబుతో 'జనగణమన' టైటిల్ తో ఒక సినిమా చేయాలనుకున్నాడు. అయితే మహేశ్ బాబు నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో పూరి ఈ కథను పక్కన పెట్టేశాడు. 'ఇస్మార్ట్ శంకర్' తో పూరికి ఇప్పుడు హిట్ పడటంతో, మళ్లీ 'జనగణమన' స్క్రిప్ట్ ను బయటికి తీశాడు. 'కేజీఎఫ్' సంచలన విజయంతో స్టార్ హీరోగా మారిపోయిన యష్ తో ఈ సినిమా చేయడానికి సన్నాహాలు మొదలుపెట్టాడు.

ఇటీవలే బెంగళూరులో యష్ ను కలిసి పూరి కథ వినిపించాడట. యష్ సందేహాలను వ్యక్తం చేసిన చోట చిన్న చిన్న మార్పులను చేసి, మరోసారి స్క్రిప్ట్ ను వినిపించడానికి పూరి సిద్ధమవుతున్నాడని అంటున్నారు. ఫైనల్ సిటింగ్ పూర్తయిన తరువాత ప్రాజెక్టు గురించిన ప్రకటన చేసే ఆలోచనలో వున్నారట. సౌత్ కి చెందిన ఒక ప్రముఖ నిర్మాత ఈ సినిమాను నిర్మించనున్నాడనీ, తెలుగు .. తమిళ .. కన్నడ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారని సమాచారం. 
Puri
Yash

More Telugu News