Andhra Pradesh: సమర్థత లేని నాయకుల వల్లే ఎన్నికల్లో ఓడిపోయాం: పవన్ కల్యాణ్

  • ఎన్నికల్లో ఏం తప్పులు చేశామో గుర్తించాలి
  • ఏదో ఒకరోజు దేశం మొత్తం మన వైపు చూసేలా చేస్తా
  • ఏపీ అసెంబ్లీలో కొట్టుకోవడం ఒక్కటే తక్కువ
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మొన్నటి ఎన్నికల్లో సమర్థత లేని నాయకుల వల్లే ఓడిపోయామని అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో రాజమహేంద్రవరానికి చెందిన పార్టీ నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఎన్నికల్లో ఏం తప్పులు చేశామో గుర్తించాలని సూచించారు. ఏదో ఒకరోజు దేశం మొత్తం మన వైపు చూసేలా చేస్తానని అన్నారు. తనకు స్వార్థం లేదని, అదే ఉంటే పది మందితో వెళ్లి ఏదైనా పార్టీలో కలిసేవాణ్ని అని అన్నారు. ఈ సందర్భంగా శాసనసభా సమావేశాల గురించి ఆయన ప్రస్తావిస్తూ, సభలో కొట్టుకోవడం ఒక్కటే తక్కువ అని వ్యాఖ్యానించారు. అమలు చేయలేని హామీలు ఇవ్వడం ఎందుకు? ఏపీలో దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తానన్న జగన్ ప్రకటనపై పవన్ స్పందిస్తూ, అమలు చేయలేరని అభిప్రాయపడ్డారు. 
Andhra Pradesh
janasena
Pawan Kalyan
YSRCP

More Telugu News