Azam Khan: ఆజంఖాన్ కుమారుడు అబ్దుల్లా అరెస్ట్

  • పాస్ పోర్టు, ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లలో వేర్వేరు పుట్టిన తేదీలు
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన బీజేపీ నేత ఆకాశ్ సక్సేనా
  • సువార్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న అబ్దుల్లా
సమాజ్ వాదీ పార్టీ వివాదాస్పద ఎంపీ ఆజంఖాన్ కుమారుడు అబ్దుల్లా ఆజంఖాన్ ను ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పాస్ పోర్టులో పుట్టిన రోజు వివరాలను తప్పుగా పేర్కొన్నట్టు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి అబ్దుల్లాపై బీజేపీ నేత ఆకాశ్ సక్సేనా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాస్ పోర్టు, ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లలో పుట్టిన తేదీ వివరాలు వేర్వేరుగా ఉన్నాయని తన ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదు చేసిన మరుసటి రోజే అబ్దుల్లాను పోలీసులు అరెస్ట్ చేయడం గమనార్హం. సువార్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా అబ్దుల్లా కొనసాగుతున్నారు.
Azam Khan
Abdullah Azam Khan
Arrest

More Telugu News