Triple Talak: ట్రిపుల్ తలాక్ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపిన మరుసటి రోజే.. భార్యకు తలాక్ చెప్పిన భర్త

  • గుజరాత్ లో భార్యకు తలాక్ చెప్పిన భర్త
  • ఆత్మహత్యాయత్నం చేసిన బాధితురాలు
  • భర్తతో పాటు అత్తామామలపై కేసు నమోదు
ముస్లిం మహిళలకు రక్షణ కల్పించే ట్రిపుల్ తలాక్ బిల్లును పార్లమెంటు ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ బిల్లుకు పార్లమెంటు ఆమోదం పలికిన మరుసటి రోజే గుజరాత్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళకు ఆమె భర్త తలాక్ చెప్పాడు. దీంతో, ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. మరోవైపు తలాక్ చెప్పినందుకు ఆమె భర్తతో పాటు అత్తామామలపై పోలీసులు కేసు నమోదు చేశారు.  
Triple Talak
Gujarath

More Telugu News