Stephen Ravindra: స్టీఫెన్ రవీంద్రకు క్లియరెన్స్ ఇచ్చిన కేంద్ర హోంశాఖ

  • ఇంటర్ స్టేట్ డిప్యుటేషన్ కు అనుమతించిన కేంద్ర హోంశాఖ
  • రెండు, మూడు రోజుల్లో తెలంగాణ ప్రభుత్వానికి అందనున్న కేంద్ర ఉత్తర్వులు
  • రెండు నెలల నుంచి సెలవులో స్టీఫెన్ రవీంద్ర
ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్ గా స్టీఫెన్ రవీంద్ర నియామకానికి అడ్డంకులు తొలగిపోయాయి. తెలంగాణ నుంచి ఏపీకి వచ్చేందుకు ఇంటర్ స్టేట్ డిప్యుటేషన్ కి కేంద్ర హోంశాఖ అనుమతించింది. రెండు, మూడు రోజుల్లో దీనికి సంబంధించిన లేఖ తెలంగాణ ప్రభుత్వానికి అందనుంది. అనంతరం స్టీఫెన్ రవీంద్రను ఏపీకి డిప్యుటేషన్ కింద పంపుతున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఆ తర్వాత ఏపీలో ఆయన బాధ్యతలను స్వీకరిస్తారు. రెండు నెలల నుంచి స్టీఫెన్ రవీంద్ర సెలవులో ఉన్నారు.
Stephen Ravindra
IPS
Deputation

More Telugu News