Srinivas: 'రాక్షసుడు' ఒక సైకో కిల్లర్ కథ: బెల్లంకొండ శ్రీనివాస్

  • వచ్చేనెల 2న రానున్న 'రాక్షసుడు'
  • ఇంట్రెస్టింగ్ గా సాగే క్రైమ్ థ్రిల్లర్
  • పోలీస్ ఆఫీసర్ గా చేశానన్న శ్రీనివాస్
ఇటీవల కాలంలో బెల్లంకొండ శ్రీనివాస్ కి హిట్ పడకపోయినా, పట్టువదలని విక్రమార్కుడిలా ఆయన వరుస సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. అవకాశాల కోసం తొందరపడకుండా వైవిధ్యభరితమైన కథలకి ఆయన ప్రాధాన్యతను ఇవ్వడం విశేషం. అలా తాజాగా ఆయన చేసిన 'రాక్షసుడు' వచ్చేనెల 2వ తేదీన విడుదల కానుంది. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి.

తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ .. "టీనేజ్ అమ్మాయిలను కిడ్నాప్ చేసి .. వాళ్లను హత్య చేసే ఒక సైకో కిల్లర్ కథగా ఈ సినిమా రూపొందింది. బలమైన కథాకథనాలతో ఈ క్రైమ్ థ్రిల్లర్ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నా పాత్ర అందరికీ నచ్చుతుంది. జిబ్రాన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా తప్పకుండా హిట్ కొడుతుందనే నమ్మకం వుంది" అని చెప్పుకొచ్చాడు. 
Srinivas
Anupama

More Telugu News