Jagan: నేడు హైదరాబాద్ కు వైఎస్ జగన్ ఫ్యామిలీ!

  • మధ్యాహ్నం 2 గంటలకు అమరావతి నుంచి బయలుదేరనున్న జగన్
  • యూఎస్, ఇజ్రాయిల్ కాన్సులేట్లకు కుటుంబీకులతో జగన్
  • రేపు విదేశీ పర్యటనకు వెళ్లనున్న ఏపీ సీఎం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తన కుటుంబ సభ్యులతో కలిసి నేడు హైదరాబాద్ కు రానున్నారు. అమరావతి నుంచి మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరనున్న ఆయన, 3 గంటలకు హైదరాబాద్ చేరుకుని, ఆపై 3.30 గంటలకు అమెరికా కాన్సులేట్ జనరల్ కార్యాలయానికి, అనంతరం ఇజ్రాయిల్ కాన్సులేట్ కు వెళ్లనున్నారు. విదేశీ పర్యటనకు వెళ్లాలని భావిస్తున్న జగన్, గురువారం నాడు జెరూసలేంకు బయలుదేరనున్నారు. జెరూసలేం పర్యటన అనంతరం ఆయన అటునుంచి అటే అమెరికా బయలుదేరుతారు.
Jagan
Family
Hyderabad
USA

More Telugu News