Kesineni Nani: జగన్ గారూ, మీకు చేత కాకపోతే చెప్పండి.. నేను చేసి చూపిస్తా: కేశినేని నాని
విజయవాడలోని బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ జాప్యంపై ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ ఎంపీ కేశినేని నాని తీవ్ర విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రూ. 12.50 కోట్ల నిధులను విడుదల చేయించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆయన మండిపడ్డారు. 'ఇంత చిన్న సమస్యకే పరిష్కారం చూపలేని మీరు ఈ రాష్ట్రం ఎదుర్కొంటున్న అనేక పెద్ద సమస్యలను ఎలా పరిష్కరిస్తారు జగన్ గారూ? అంటూ విమర్శనాస్త్రం సంధించారు. 'మీకు చేత కాకపోతే చెప్పండి... నేను చేసి చూపిస్తా'నని అన్నారు. మీరు నిమ్మగడ్డ ప్రసాద్ వ్యవహారం చూసుకోవచ్చంటూ సెటైర్ వేశారు.