ys vivekananda reddy: వివేకా హత్యకేసు: కొమ్మా పరమేశ్వర్‌రెడ్డికి నార్కో అనాలసిస్‌ పరీక్ష

  • ఇప్పటికే ముగ్గురికి నార్కో అనాలసిస్ పరీక్షకు అనుమతి
  • తాజాగా పరమేశ్వర్‌రెడ్డికి పరీక్షల కోసం కోర్టు అనుమతి
  • త్వరలో గుజరాత్‌కు తరలింపు

మాజీ మంత్రి, వైసీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కొమ్మా పరమేశ్వర్‌రెడ్డికి నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. పరమేశ్వర్ రెడ్డిని మంగళవారం పోలీసులు పులివెందుల సివిల్‌ జడ్జి కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా నార్కో అనాలసిస్, బీప్ పరీక్షలకు అనుమతి ఇవ్వాలని కోరారు. స్పందించిన కోర్టు ఈ పరీక్షలకు సమ్మతమేనా? అని పరమేశ్వర్ రెడ్డిని ప్రశ్నించింది.

తనకు గుండె జబ్బు ఉందని, ఇటువంటి పరీక్షలు చేస్తే ఇబ్బందేమోనని కోర్టుకు తెలిపారు. స్పందించిన న్యాయమూర్తి ఆరోగ్య సంబంధమైన విషయాలను వైద్యులు చూసుకుంటారని పేర్కొంటూ నార్కో అనాలసిస్, బీప్ పరీక్షలకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, ఇప్పటికే  వాచ్‌మన్‌ రంగయ్య, ఎర్ర గంగిరెడ్డి, శేఖర్‌రెడ్డిలను నార్కో అనాలసిస్‌ పరీక్షల నిమిత్తం గుజరాత్‌ తరలించారు. ఇప్పుడు పరమేశ్వర్ రెడ్డిని కూడా అక్కడికి తరలించనున్నారు.

More Telugu News