Koratala Siva: మరోసారి చిరూ సరసన కాజల్?

  • చిరూ తదుపరి ప్రాజెక్టు కొరటాలతో
  • చకచకా జరుగుతోన్న సన్నాహాలు
  •  కాజల్ కి భారీ పారితోషికం        
చిరంజీవితో సినిమా చేయడానికి కొరటాల శివ సిద్ధమవుతున్నాడు. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి ఆయన సన్నాహాలు చేసుకుంటున్నాడు. రెండు డిఫరెంట్ షేడ్స్ లో చిరంజీవి కనిపించే ఈ సినిమాలో, కథానాయిక పాత్ర కోసం నయనతారనుగానీ .. అనుష్కనుగాని తీసుకునే అవకాశం వున్నట్టుగా కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.

కానీ తాజాగా కాజల్ పేరు తెరపైకి వచ్చింది. ఇంతకుముందు చిరంజీవి జోడీగా కాజల్ చేసిన 'ఖైదీ నెంబర్ 150' భారీ విజయాన్ని సాధించింది. చిరంజీవి సరసన నాయికగా కాజల్ మంచి మార్కులు కొట్టేసింది. అందువలన కొరటాల ఆమెను ఎంపిక చేసినట్టుగా చెబుతున్నారు. ఇందుకోసం కాజల్ కి ముడుతోన్న పారితోషికం భారీగానే ఉందని అంటున్నారు. త్వరలోనే ఈ విషయంపై స్పష్టత రానుంది.
Koratala Siva
Kajal

More Telugu News