Cafe Coffee Day: సిద్ధార్థ అదృశ్యంపై అనుమానం ఉంది: డీకే శివకుమార్

  • ఆత్మహత్య చేసుకునే పిరికివాడు కాదు
  • 28న కూడా ఫోన్ లో మాట్లాడాడు
  • కర్ణాటక కాంగ్రెస్ నేత శివకుమార్
'కేఫ్ కాఫీ డే' వ్యవస్థాపకుడు సిద్ధార్థ అదృశ్యంపై తనకెన్నో అనుమానాలు ఉన్నాయని కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ వ్యాఖ్యానించారు. సిద్ధార్థ చాలా ధైర్యవంతుడని, అతను ఆత్మహత్య చేసుకుంటాడంటే నమ్మలేనని అన్నారు. సిద్ధార్థ ఉద్యోగులకు 27వ తేదీన లేఖ రాసినట్టు ఉందని, కానీ ఆయన తనతో 28న కూడా మాట్లాడాడని, ఒకసారి కలిసి మిగతా విషయాలు మాట్లాడుదామని అన్నానని, అంతలోనే ఆయన అదృశ్యం కావడం అనుమానాలను పెంచుతోందని అన్నారు. పోలీసులు కేసును సీరియస్ గా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎస్ఎం కృష్ణ నివాసానికి వెళ్లిన శివకుమార్, ధైర్యంగా ఉండాలని ఆయన కుటుంబీకులకు చెప్పారు. 
Cafe Coffee Day
Sidhartha
DK Sivakumar

More Telugu News