SBI: ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు తగ్గించిన ఎస్ బీఐ

షార్ట్స్‌లో చూడండి
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ) ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను తగ్గించింది. ఈ మేరకు సవరించిన వడ్డీరేట్లను ప్రకటించింది. తక్కువ కాలపరిమితి డిపాజిట్లపై 50 నుంచి 75 బేసిస్ పాయింట్లు తగ్గించారు. రిటైల్ డిపాజిట్లపై 20 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సవరించిన వడ్డీ రేట్లు ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణాలపై వడ్డీ రేట్లను 75 బేసిస్ పాయింట్లకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న దరిమిలా ఎస్ బీఐ తన తాజా వడ్డీరేట్లను ప్రకటించినట్టు తెలుస్తోంది.
Go Back to Shorts
SBI
Banl
RBI

More Telugu News