Chandrababu: చిరుద్యోగులు ఉద్యోగ భద్రత కోసం రోడ్డెక్కి పోరాడాల్సిరావడం దురదృష్టకరం: చంద్రబాబు

  • గత ఐదేళ్లలో ఇలాంటి నిరసనలు లేవన్న మాజీ సీఎం
  • అందరి సంక్షేమమే పరమావధిగా పనిచేశామంటూ ట్వీట్
  • చిరుద్యోగులకు టీడీపీ తోడుగా నిలుస్తుందని వెల్లడి
ఇటీవల కాలంలో రాష్ట్రంలో చిరుద్యోగులు రోడ్డెక్కి నిరసనలు తెలియజేస్తుండడం మీడియాలో తరచుగా కనిపిస్తోంది. దీనిపై మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. గత ఐదేళ్లలో చిరు వేతన జీవులు ఈ విధంగా ఎప్పుడూ రోడ్డెక్కలేదని పేర్కొన్నారు. తమకు వీలైనంతగా అందరి సంక్షేమమే పరమావధిగా పనిచేశామని, కానీ ఇప్పుడు చిరుద్యోగులు తమ ఉద్యోగాలను కాపాడుకోవడం కోసం పోరాటాలు చేయాల్సిరావడం దురదృష్టకరమని ట్వీట్ చేశారు. వారి పోరాటంలో తాము తోడుగా నిలుస్తామని చెబుతూ సంఘీభావం ప్రకటించారు.
Chandrababu
Andhra Pradesh
YSRCP
Jagan

More Telugu News