Iron Rods: విశాఖ స్టీల్ ప్లాంటులో కార్మికుడిపై పడిన ఐరన్ రాడ్లు

  • ఎస్బీఎమ్ బార్ మిల్లులో ప్రమాదం
  • క్రేన్ సాయంతో రాడ్లను తొలగిస్తున్న కార్మికులు
  • తీవ్ర గాయాలపాలైన బాధితుడు
పనిలో నిమగ్నమై ఉండగా ఒక్కసారిగా కార్మికుడిపై ఐరన్ రాడ్లు పడిపోయాయి. విశాఖ స్టీల్ ప్లాంటులోని ఎస్బీఎమ్ బార్ మిల్లులో ఈ ప్రమాదం జరిగింది. ఐరన్ రాడ్ల కింద కార్మికుడు చిక్కుకోవడంతో తోటి కార్మికులు అతడిని రక్షించేందుకు క్రేన్ సాయంతో యత్నిస్తున్నారు. అయితే రాడ్ల కింద చిక్కుకున్న కార్మికుడికి తీవ్ర గాయాలయినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకుని బాధితుడి కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితుడిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చి మెరుగైన వైద్యం అందించాలని కోరుతున్నారు.
Iron Rods
Visakha Steel Plant
SBM Bar
Crane

More Telugu News