Prem: స్నేహితుల మధ్య విభేదాలు.. ఒకరి హత్య!

  • గంజాయి తాగేందుకు ప్రేమ్‌ను పిలిచిన సతీశ్
  • ఓ విషయమై ఇద్దరి మధ్యా వాగ్వాదం
  • మిగిలిన స్నేహితులతో కలిసి ప్రేమ్ హత్య
గంజాయి తాగుదామని పిలిచి వ్యక్తిని మట్టుబెట్టిన ఘటన హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లో చోటు చేసుకుంది. స్నేహితుల మధ్య తలెత్తిన విభేదాలే హత్యకు కారణమని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. సతీశ్ అనే వ్యక్తి తన స్నేహితుడు ప్రేమ్‌ను గంజాయి తాగేందుకు పిలిచాడు. మరికొందరితో కలిసి గంజాయి తాగిన అనంతరం ప్రేమ్, సతీశ్‌ల మధ్య ఓ విషయమై తలెత్తిన వాగ్వాదం ప్రేమ్ హత్యకు దారి తీసింది. మిగతా స్నేహితులతో కలిసి ప్రేమ్‌పై సతీశ్ దాడి చేశాడు. దీంతో ప్రేమ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రేమ్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Prem
Sathish
Hyderabad
Film Nagar
Drugs
Murder

More Telugu News