Prabhas: ఒకే రోజున నాలుగు భాషల్లో 'సాహో' ట్రైలర్

  • ప్రభాస్ తాజా చిత్రంగా 'సాహో'
  • ఆగస్టు 15న ట్రైలర్ రిలీజ్ చేసే ఆలోచన
  •  ప్రీ రిలీజ్ ఈవెంట్ పై తర్జన భర్జనలు      
సుజిత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో 'సాహో' సినిమాను నిర్మించారు. ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ నటించిన ఈ సినిమాను ముందుగా ఆగస్టు 15వ తేదీన విడుదల చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆ తరువాత కొన్ని కారణాల వలన ఆగస్టు 30కి వాయిదా వేశారు. దాంతో ప్రభాస్ అభిమానులు అప్సెట్ అయ్యారు.

అది గమనించిన ఈ సినిమా టీమ్, అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపడం కోసం ఆగస్టు 15వ తేదీన ట్రైలర్ ను రిలీజ్ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం. ఈ సినిమాను విడుదల చేయనున్న నాలుగు భాషల్లోను అదే రోజున ట్రైలర్ ను వదలనున్నారు. అయితే ట్రైలర్ ను మామూలుగానే విడుదల చేయాలా? లేదంటే ప్రీ రిలీజ్ వేదికపై చేయాలా? అనే తర్జనభర్జనలు జరుగుతున్నాయని అంటున్నారు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ తేదీ .. వేదిక గురించిన నిర్ణయాన్ని కూడా త్వరలోనే తీసుకోనున్నారని చెప్పుకుంటున్నారు.
Prabhas
Shraddha Kapoor

More Telugu News