Prabhas: లండన్ వెళ్లనున్న ప్రభాస్, అనుష్క

  • సంచలన విజయం సాధించిన 'బాహుబలి 2'
  • లండన్ రాయల్ ఆల్బర్ట్ హాల్ లో ప్రత్యేక ప్రదర్శన 
  • అక్టోబర్లో లండన్ వెళ్లనున్న టీమ్  
ఒక వైపున ప్రభాస్ 'సాహో' సినిమా పనులతో .. మరో వైపున అనుష్క 'సైలెన్స్' సినిమా షూటింగులో బిజీగా వున్నారు. త్వరలో వీళ్లిద్దరూ 'లండన్' వెళ్లనున్నారనేది ఫిల్మ్ నగర్ టాక్. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కొన్ని సినిమాలను ప్రతి సంవత్సరం అక్టోబర్ మాసంలో లండన్ లోని 'రాయల్ ఆల్బర్ట్ హాల్' లో ప్రదర్శిస్తారు.

ఎలిజబెత్ రాణి కుటుంబ సభ్యులతో పాటు లండన్ లోని వివిధ రంగాలకి చెందిన ప్రముఖులు ఈ ప్రదర్శనకి హాజరవుతారు. ఈ ఏడాది ప్రదర్శితమయ్యే సినిమాల్లో 'బాహుబలి 2' సినిమాకి చోటు దొరికింది. సినిమాను ప్రదర్శించిన అనంతరం అక్కడి ప్రముఖులతో ఆ సినిమా టీమ్ ముఖాముఖి వుంటుందట. అందువలన లండన్ లో అక్టోబర్లో జరిగే 'బాహుబలి 2' ప్రదర్శనకి రాజమౌళి .. ప్రభాస్ .. అనుష్క .. రానా .. కీరవాణి వెళ్లనున్నారని సమాచారం.
Prabhas
Anushka

More Telugu News