Narendra Modi: ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ షోలో పాల్గొన్న మోదీ.. పలు సాహసాలు చేసిన ప్రధాని!

  • వచ్చే నెల 12న ప్రసారం కానున్న షో
  • బేర్ గ్రిల్స్ తో కలిసి మోదీ సాహసయాత్ర
  • గ్రిల్స్బి  తో కలిసి వేటాడనున్న మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ అనగానే తన మాటల తూటాలతో ప్రత్యర్థులను కకావికలం చేసే నేత గుర్తుకు వస్తారు. రాజకీయ ప్రత్యర్థులను తన వ్యూహాలతో మోదీ చిత్తు చేస్తారు. మరోవైపు ఇంగ్లాండ్ కు చెందిన బేర్ గ్రిల్స్ ప్రముఖ సాహస యాత్రికుడు. వేల అడుగుల ఎత్తులో వెళుతున్న విమానాల నుంచి దూకేయడం, సింహాలు, పులుల మధ్య భయం లేకుండా తిరగడం, విష సర్పాలతో ఆడుకోవడం ఇతనికి కొట్టిన పిండి. ఒకవేళ వీరిద్దరూ ఓ అడవిలో కలిస్తే..!

క్రూర మృగాలు, విష సర్పాల నుంచి తప్పించుకుంటూ భోజనం కోసం వేటాడుతూ వీరిద్దరూ ఎలా బతుకుతారు? నదుల్ని ఎలా దాటుతారో మీకు చూడాలని ఉందా? అయితే అందరూ సిద్ధమైపోండి. ఎందుకంటే ప్రధాని మోదీ, బేర్ గ్రిల్స్ సాహసయాత్ర మన టీవీల్లో రాబోతోంది.

ఆగస్టు 12న రాత్రి 9 గంటలకు మోదీ-గ్రిల్స్ చేసిన సాహయాత్ర ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ షోలో ప్రసారం కాబోతోంది. డిస్కవరీ నెట్ వర్క్ కు చెందిన ఛానళ్లలో ఇది ప్రసారం కానుంది. ఇందుకు సంబంధించిన ప్రోమోను మీరూ చూడచ్చు.
Narendra Modi
Prime Minister
Bear Grylls
Man Vs Wild

More Telugu News