Kuldeep Bishnoi: హర్యానా కాంగ్రెస్ ఎమ్మెల్యేపై ఐటీ దాడులు.. రూ.. 200 కోట్ల విలువైన విదేశీ ఆస్తుల గుర్తింపు!

షార్ట్స్‌లో చూడండి
దేశ వ్యాప్తంగా పలువురు రాజకీయవేత్తలపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా, హర్యానా కాంగ్రెస్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణోయి, అతని కుటుంబసభ్యులపై ఐటీ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో రూ. 200 కోట్ల విలువైన విదేశీ ఆస్తులను గుర్తించారు. ఢిల్లీ, హర్యాణా, హిమాచల్ ప్రదేశ్ లలో ఈ నెల 23న కుల్దీప్ కు చెందిన 13 ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో విదేశీ ఆస్తులను గుర్తించామని ఐటీ అధికారులు తాజాగా ప్రకటించారు.

రాజకీయ పలుకుబడి కలిగిన నాయకులు కొన్ని దశాబ్దాలుగా నల్ల ధనాన్ని భారీ ఎత్తున పోగేసుకుంటున్నారని ఐటీ శాఖ ఓ ప్రకటన ద్వారా తెలిపింది. కుల్దీప్ కు రూ. 200 కోట్ల విదేశీ ఆస్తులు ఉన్న విషయాన్నే కాకుండా, రూ. 30 కోట్లకు పైగా ఆదాయపు పన్నును ఎగ్గొట్టారనే విషయాన్ని కూడా గుర్తించామని వెల్లడించింది. బ్రిటీష్ వర్జిన్ ఐలాండ్స్, పనామా, యూకే, యూఏఈలలో ఈ ఆస్తులు ఉన్నాయని తెలిపింది. ఈ వివరాలను ఈడీతో పాటు ఇతర దర్యాప్తు శాఖలతో పంచుకుంటామని చెప్పింది.
Go Back to Shorts
Kuldeep Bishnoi
Haryana
Congress MLA
IT Raids
Foreign Assets

More Telugu News