Imran Khan: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు బీజేపీ సభ్యతం... ఫోర్జరీ కేసు నమోదు!

  • ఇమ్రాన్, డేరాబాబాలకు ఈ-సభ్యత్వం తీసుకున్న ఫరీద్ అనే వ్యక్తి
  • సోషల్ మీడియాలో ప్రచారం
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు బీజేపీ సభ్యత్వం ఏమిటనుకుంటున్నారా? ఇది ఆయనకు బీజేపీ ఇచ్చిన సభ్యత్వం కాదు. గుజరాత్ లోని అహ్మదాబాద్ కు చెందిన గులాం ఫరీద్ షేక్ అనే వ్యక్తి చేసిన నిర్వాకం ఇది. 40 ఏళ్ల ఫరీద్... ఇమ్రాన్ ఖాన్ కే కాదు, డేరాబాబా, ఆశారాం బాపులకు కూడా బీజేపీ ఈ-సభ్యత్వం తీసుకుని, వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. ఈ వ్యవహారం కాస్తా బీజేపీ నేతలకు తెలియడంతో... తమ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఆయన ఇలా చేస్తున్నాడంటూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, నిందితుడిపై గుజరాత్ పోలీసులు ఫోర్జరీ కేసును నమోదు చేశారు.



Imran Khan
Dera Baba
Asharam Bapu
BJP
Membership

More Telugu News