Rajyasabha: బ్రేకింగ్... రాజ్యసభలో షార్ట్ సర్క్యూట్... సభ వాయిదా!

  • మైక్ సిస్టమ్ లో పొగలు
  • సభలో గందరగోళ పరిస్థితి
  • బయటకు పరుగులు తీసిన సభ్యులు
రాజ్యసభలో కొద్దిసేపటి క్రితం పెను ప్రమాదం తప్పింది. సభ జరుగుతున్న వేళ షార్ట్ సర్క్యూట్ జరిగింది. దీంతో సభ్యులు కూర్చున్న కుర్చీల కింద నుంచి పొగలు వచ్చాయి. దీంతో గందరగోళ పరిస్థితి నెలకొనడంతో, సభ్యులంతా తమ స్థానాల నుంచి లేచి బయటకు పరుగులు తీశారు. దీంతో సభను 15 నిమిషాల పాటు వాయిదా వేస్తున్నట్టు చైర్మన్ ప్రకటించారు. కాగా, సభ్యుల మైక్ కనెక్టింగ్ సిస్టమ్ లో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి పొగలు వచ్చినట్టు సమాచారం. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
Rajyasabha
Short sircuit

More Telugu News