Bigg Boss: తమిళ బిగ్ బాస్ లో అమ్మాయిల గురించి మరో వివాదం.. మండిపడ్డ చిన్మయి

  • కంటెస్టెంట్ శరవణన్ వివాదాస్పద వ్యాఖ్యలు 
  • అమ్మాయిలను తాకేందుకు బస్సు ఎక్కేవారమన్న శరవణన్
  • సిగ్గు పడాల్సిన విషయమన్న చిన్మయి
బిగ్ బాస్ రియాల్టీ షో అన్ని భాషల్లో వివాదాస్పదమవుతున్న సంగతి తెలిసిందే. ఎన్నో సమస్యలు ఈ షోను చుట్టుముడుతున్నాయి. వివాదాల విషయంలో తమిళ బిగ్ బాస్ అన్నింటికన్నా ఒక అడుగు ముందే ఉంటుంది. తాజాగా తమిళ బిగ్ బాస్ ను మరో వివాదం చుట్టుముట్టింది. ఈ షోలో కంటెస్టెంట్ గా ఉన్న నటుడు శరవణన్ చేసిన వ్యాఖ్యలు కొత్త రచ్చకు తెరతీశాయి.

షో సందర్భంగా శరవణన్ మాట్లాడుతూ, తన కాలేజీ రోజుల గురించి చెప్పుకొచ్చాడు. మహిళలను, అమ్మాయిలను తాకవచ్చనే ఉద్దేశంతో తాము బస్సులు ఎక్కేవారమని ఆయన తెలిపాడు. ఆయన వ్యాఖ్యలకు షోలో ఉన్న ఇతర పార్టిసిపెంట్లు చప్పట్లు కొట్టి, ఆనందం వ్యక్తం చేశారు.

ఈ వ్యాఖ్యలపై 'మీటూ' మూమెంట్ లో తన గళాన్ని గట్టిగా వినిపించిన సింగర్ చిన్మయి మండిపడింది. 'మహిళలను తాకేందుకు తాము బస్సులు ఎక్కేవారమని ఒక వ్యక్తి గొప్పగా చెప్పుకున్న విషయాన్ని ఓ తమిళ చానల్ టెలికాస్ట్ చేసింది. ఇది సిగ్గు పడాల్సిన విషయం' అంటూ విమర్శలు గుప్పించింది.
Bigg Boss
Saravanan
Chinmayi Sripaada
Tamil

More Telugu News