కిడ్నాప్ చేసి దారుణంగా చంపబోతే... ముగ్గులోకి దించి బయటపడిన అథ్లెట్ నటాలీ!
- నటాలీ బిర్లీని బలవంతంగా తీసుకెళ్లిన కిడ్నాపర్
- నగ్నంగా కట్టేసి హింసలు
- ప్లాన్ వేసి తప్పించుకున్న యువతి
కాసేపటి తరువాత నటాలీకి స్పృహ వచ్చి చూడగా, తాను నగ్నంగా ఓ కుర్చీలో కట్టివేయబడివున్నానని గమనించింది. ఎదురుగా భయంకరంగా కనిపిస్తున్న వ్యక్తి, చేతిలో కత్తి పట్టుకుని మద్యం తాగాలని బెదిరించాడు. నటాలీ తాగబోనని కరాఖండీగా చెప్పింది. దీంతో ఆగ్రహంతో ముక్కు మూసి ఆమెను చంపాలని చూశాడు. అది కుదరకపోవడంతో నీళ్లు నిండిన బాత్ టబ్ లో ముంచి చంపాలని చూశాడు. ఇక తాను బతకడం అసాధ్యమేనన్న ఆందోళన నిండిన ఆమె, ఆ ఇంట్లో చాలా ఆర్చిడ్ పూల మొక్కలున్నాయని గుర్తించి, ప్లాన్ వేసింది.
తనకు ఆ పూలంటే చాలా ఇష్టమని అతనితో చెప్పింది. మెల్లిగా మాట్లాడుతూ, ముగ్గులోకి దించింది. దీంతో ఆ కసాయి కూడా కబుర్లలో పడ్డాడు. తానెందుకు ఉన్మాదిగా మారిందీ చెప్పాడు. తండ్రి చనిపోయాడని, తల్లి మద్యానికి బానిసైందని, ప్రియురాలు మోసం చేయడంతో లోకంపై కసిని పెంచుకున్నానని చెప్పాడు. అతన్ని పూర్తిగా కబుర్లలోకి దించిన ఆమె, తనను చంపవద్దని వేడుకుంటూనే, రోడ్డుపై వెళుతుంటే ప్రమాదవశాత్తూ దెబ్బలు తగిలాయని చెబుతానని నమ్మబలికింది.
కొన్ని గంటలుగా ఆమెతో మాట్లాడుతున్న కిడ్నాపర్, ఆమె మత్తులో పడిపోయి, క్షేమంగా తీసుకెళ్లి ఇంటి దగ్గర దింపేసి వెళ్లిపోయాడు. ఆ వెంటనే తానిచ్చిన హామీని పక్కనబెట్టిన నటాలీ, మరో అమ్మాయికి తనకు పట్టిన గతే పట్టరాదన్న ఉద్దేశంతో పోలీసులకు పూర్తి సమాచారం ఇచ్చింది. దీంతో వెంటనే పోలీసులు ఆ కిడ్నాపర్ ను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.