Varla Ramaiah: అయ్యా ఏపీ సీఎం... చంద్రబాబు మీద కోపం అమరావతిపై చూపకండి: జగన్ కు వర్ల రామయ్య హితవు

షార్ట్స్‌లో చూడండి
టీడీపీ నేత వర్ల రామయ్య ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై ధ్వజమెత్తారు. ఈ మేరకు ట్విట్టర్ లో తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు మీద కోపం అమరావతిపై చూపకండి, ధర్మపాలన చేయండి అంటూ హితవు పలికారు. "అయ్యా ఏపీ సీఎం, అమరావతిని చంద్రబాబు కన్నబిడ్డలా చూసుకుంటే మీరేంటి సవతి బిడ్డలా నిర్లక్ష్యం చేస్తున్నారని రాష్ట్రమంతా కోడైకూస్తోంది. ఏపీ రాజధానిని చంద్రబాబు కంటికి రెప్పలా చూసుకున్నారు. మరి మీరెందుకు పట్టించుకోవడం లేదు? రాజధానిని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు?" అంటూ వర్ల రామయ్య ట్వీట్ చేశారు.
Go Back to Shorts
Varla Ramaiah
Jagan
Chandrababu
Andhra Pradesh
Telugudesam
YSRCP

More Telugu News