T-congress: జైపాల్ రెడ్డి మృతిపై చిరంజీవి సంతాపం

  • దేశ రాజకీయాల్లో జైపాల్ రెడ్డి తనదైన ముద్ర వేశారు
  • ఆయన మృతి కాంగ్రెస్ పార్టీకి తీరనిలోటు
  • ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా 
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జైపాల్ రెడ్డి మృతిపై ఆ పార్టీ నేత, ప్రముఖ సినీ నటుడు చిరంజీవి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశ రాజకీయాల్లో జైపాల్ రెడ్డి తనదైన ముద్ర వేశారని, ఆయన మృతి కాంగ్రెస్ పార్టీకి తీరనిలోటని అన్నారు. జైపాల్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని, భగవంతుని కోరుకుంటున్నానని, ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని చెప్పారు.   
T-congress
Leader
Artist
Chiranjeevi

More Telugu News