Andhra Pradesh: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి దుర్మరణం

  • మద్దిపాడు మండలం గుండ్లపల్లి వద్ద ప్రమాదం
  • అదుపు తప్పి పాల ట్యాంకర్‌ను ఢీకొన్న కారు
  • తీవ్రంగా గాయపడిన ఇద్దరు చిన్నారులు
తిరుమల వేంకటేశుని దర్శించుకుని వస్తుండగా జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం మేడూరుకు చెందిన ఓ కుటుంబం తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరుగు పయనమైంది. వారు ప్రయాణిస్తున్న కారు  ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం గుండ్లపల్లి వద్ద అదుపు తప్పి పాల ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ప్రమాద సమయంలో కారులో ఆరుగురు ఉండగా డ్రైవర్ సహా నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన అనురాధ, సుప్రియలను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతులను డ్రైవర్ సాంబారెడ్డి (44), పాండురంగారావు(42), నరసింహారావు(40), సత్యసాగర్‌ (10)లుగా గుర్తించారు.
Andhra Pradesh
Prakasam District
Road Accident

More Telugu News