Borum Toy Reviews: ఆరేళ్ల చిన్నారి సంపాదన నెలకు రూ.21 లక్షలు!

  • 'బోరమ్ టాయ్ రివ్యూస్' పేరుతో యూ ట్యూబ్ ఛానెల్‌
  • మార్కెట్‌లో రిలీజ్ అయ్యే ఆట వస్తువులపై రివ్యూ
  • యూ ట్యూబ్ ఛానల్‌కు 13 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు
బడిలో చేరాల్సిన వయసులో యూ ట్యూబ్ ఛానల్ పెట్టి నెలకు రూ.21 లక్షలు సంపాదిస్తూ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోందో చిన్నారి. దక్షిణ కొరియాకు చెందిన బోరమ్ (అభిమానులు పెట్టిన ముద్దుపేరు) తన పేరు మీద 'బోరమ్ టాయ్ రివ్యూస్' అనే యూ ట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించింది.

మార్కెట్‌లో రిలీజ్ అయ్యే ఆట వస్తువులపై రివ్యూలు చేసి తన యూట్యూబ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేస్తుంటుంది. ఆమె చేసే రివ్యూలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఏకంగా ఆమెకు 13 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారంటే ఆ యూట్యూబ్ ఛానల్‌కు ఉన్న ఆదరణ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, బోరమ్ తన సంపాదనతో రూ.55 కోట్లు పెట్టి ఓ బంగాళాను కొనేసింది. ఈ న్యూస్ దక్షిణ కొరియాలో హాట్ టాపిక్‌గా మారింది.  
Borum Toy Reviews
Youtube Channel
South Korea
Toys
Review

More Telugu News