KCR: కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెబుతూ ఒడిశా సీఎం నవీన్ లేఖ

  • ఫొని తుపాను సమయంలో స్తంభించిన విద్యుత్ వ్యవస్థ
  • విద్యుత్ శాఖ ఉద్యోగులను పంపిన కేసీఆర్
  • త్వరితగతిన విద్యుత్ పునరుద్ధరింపులో సాయం
ఒడిశా ఫొని తుపాను కారణంగా అల్లాడుతున్న సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ తనవంతు సాయాన్ని అందించారు. దీనికి గాను కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెబుతూ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ లేఖ రాశారు. ఒడిశాలో ఫొని తుపాను సమయంలో భారీగా వీచిన గాలుల తీవ్రతకు విద్యుత్ స్తంభాలు ఎక్కడికక్కడ నేలకూలి వ్యవస్థ స్తంభించింది.

దీంతో తెలంగాణ సీఎం కేసీఆర్ ఇక్కడి విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి సుమారు వెయ్యి మంది విద్యుత్ శాఖ ఉద్యోగులను రాష్ట్రం నుంచి ఒడిశాకు పంపి త్వరితగతిన విద్యుత్‌ను పునరుద్ధరించేందుకు సాయపడ్డారు. అందుకుగాను నవీన్ పట్నాయక్ కృతజ్ఞతలు చెబుతూ కేసీఆర్‌కు లేఖ రాశారు.
KCR
Odisha
Naveen Patnayak
Telangana
Poni Cyclone

More Telugu News