Madhunandan: క్రమశిక్షణ అనేది తేజగారి వల్లనే వచ్చింది: కమెడియన్ మధునందన్

  • నేను ఇండస్ట్రీలో నిలబడ్డాను
  • అందుకు క్రమశిక్షణ ప్రధాన కారణం
  • వెనక్కి వెళ్లిపోయినవాళ్లు చాలామందే వున్నారు
తెలుగు తెరపై కమెడియన్ గా మధునందన్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. " నేను కామెడీ చేయగలను .. సీరియస్ రోల్స్ చేయగలను. ఈ రెండింటిని నేను బాగా పలికించగలనని చాలా మంది దర్శకులు నాకు చెప్పారు. నా ప్రత్యేకత .. నా బలం అదేనని నేను భావిస్తున్నాను.

ఇండస్ట్రీకి నేను వచ్చి 20 ఏళ్లు దాటింది. నా తరువాత వచ్చిన చాలామంది అవకాశాలు లేక వెనక్కి వెళ్లిపోయారు. నేను మాత్రం అలా కొనసాగుతూనే వున్నాను. అందుకు కారణం నా క్రమశిక్షణ. ఈ క్రమశిక్షణ అనేది నేను దర్శకుడు తేజగారిని చూసి నేర్చుకున్నాను. ఎంత అంకితభావం ఉండాలనేది ఆయనను చూసిన తరువాతనే నాకు అర్థమైంది. నేను ఇక్కడ నిలదొక్కుకోవడానికి ఆయనే కారణమని బలంగా చెప్పగలను" అని అన్నాడు.
Madhunandan

More Telugu News