Chandrababu: చంద్రబాబు తీరు మార్చుకోకుంటే వచ్చే ఎన్నికల్లో 23 సీట్లు కూడా దక్కవు: మంత్రి ఆదిమూలపు సురేశ్

  • బాబు మాట్లాడేందుకు ఎక్కువ సమయమే ఇస్తున్నాం
  • ఏదో ఒక నెపంతో బయటకు వెళ్లిపోతున్నారు
  • బాబు, టీడీపీ నేతలు వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారు
అసెంబ్లీలో ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబుకు సభలో మాట్లాడేందుకు ఎక్కువ సమయమే ఇస్తున్నామని ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. అసెంబ్లీలో ఈరోజు ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు మాట్లాడేందుకు ఎక్కువ సమయం కేటాయించినా మాట్లాడడం లేదని, ఏదో ఒక నెపంతో బయటకు వెళ్తున్నారని  విమర్శించారు. తీరు మార్చుకోకుంటే వచ్చే ఎన్నికల్లో 23 సీట్లు కూడా దక్కవని జోస్యం చెప్పారు. చంద్రబాబు హయాంలో జరిగిన పనులపై చర్చకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. బాబు, టీడీపీ నేతలు వేల కోట్ల అవినీతికి పాల్పడింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.   
Chandrababu
Telugudesam
YSRCP
minister
aadimulapu

More Telugu News