Andhra Pradesh: పక్కా 'బిజినెస్ మేన్'.. సరికొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టిన సూపర్ స్టార్ మహేశ్ బాబు!

  • ఇప్పటికే ఏఎంబీ సినిమాస్ ప్రారంభించిన మహేశ్
  • తాజాగా దుస్తుల వ్యాపారంలోకి అడుగు 
  • మరో రెండు రోజుల్లో బ్రాండ్ పేరు ఆవిష్కరణ
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇటీవల ఏఎంబీ సినిమాస్ పేరుతో మల్టిప్లెక్స్ బిజినెస్ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా మహేశ్ మరో సరికొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టారు. మహేశ్ బాబు త్వరలోనే సొంత దుస్తుల బ్రాండ్ ను ప్రారంభించబోతున్నట్లు సమాచారం. తమ దుస్తులను http://www.spoyl.in/mahesh-babu వెబ్ సైట్ లో ఆవిష్కరిస్తామని మహేశ్ టీమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

దీన్ని మహేశ్ బాబు తన అభిమానులతో పంచుకున్నారు. ఇంకో రెండు రోజుల్లో దీనికి సంబంధించిన వివరాలు బయటకు రానున్నాయి. ఈ వెబ్ సైట్ లోకి లాగిన్ కావడం ద్వారా ప్రిన్స్ మహేశ్ బాబును అభిమానులు కలుసుకోవచ్చని తెలుస్తోంది. నటులు విజయ్ దేవరకొండ ‘రౌడీ’ పేరుతో ఇప్పటికే సొంత బ్రాండ్ ను ప్రారంభించగా, బాలీవుడ్ నటీనటులు హృతిక్ రోషన్, సోనమ్ కపూర్, అనుష్కా శర్మ, దీపికా పదుకునే, సన్నీ లియోన్ తదితరులు కూడా సొంత దుస్తుల బ్రాండ్లను నడుపుతున్నారు.
Andhra Pradesh
Telangana
Tollywood
Mahesh Babu
new business
cloths

More Telugu News